View News

news
 
 
1
రివ్యూ : ‘కాలా’- రజనీ మాస్ పెర్ఫామెన్స్..
రివ్యూ : ‘కాలా’- రజనీ మాస్ పెర్ఫామెన్స్.. స్టార్ కాస్ట్ : ర‌జనీకాంత్‌, నానా ప‌టేక‌ర్‌, ఈశ్వ‌రీరావు తదితరులు.. దర్శకత్వం : పా.రంజిత్‌ నిర్మాతలు: ధ‌నుశ్‌ మ్యూజిక్ : స‌ంతోశ్ నారాయ‌ణ్‌ విడుదల తేది : జూన్ 7, 2018 రేటింగ్ : 3/5 కథ : క‌రికాల‌న్‌(ర‌జ‌నీకాంత్‌) ముంబై లోని ధారావి అనే మురికివాడలో ఉంటూ, అక్కడి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని వారి సమస్యలఫై పోరాడుతూ నాయకుడుగా ఉంటాడు. ఎప్పటినుండో ఆ ప్రాంతాన్ని నమ్ముకొని చాలామంది ప్రజలు అక్కడ నివాసం ఉంటారు. అయితే ఆ ప్రాంతాన్ని కబ్జా చేయాలనీ చాల రోజులుగా రాజకీయ నాయకుడైన హ‌రినాథ్ దేశాయ్‌(నానా ప‌టేక‌ర్‌) ట్రై చేస్తుంటాడు. కానీ అక్కడి ప్రజలు మాత్రం ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లేందుకు ఇష్టపడరు. దాంతో ఎలాగైనా ఆ ప్రాంతం దక్కించుకోవాలని అనుకున్న హ‌రినాథ్ దేశాయ్‌, వారి మధ్య కుల మత గొడవలు సృష్టిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? క‌రికాల‌న్‌ ఈ గొడవలను ఎలా ఆపుతాడు..? అసలు క‌రికాల‌న్‌ ఎక్కడి నుండి వస్తాడు..? చివరకు ధారావి ప్రాంతం ఎవరికీ దక్కుతుంది..? అనేది మీరు తెర ఫై చూడాల్సిందే. * రజనీకాంత్ నటన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏముంది..సరైన మాస్ కథ పడితే తెర మీద ఓ ఆట ఆడుకుంటాడు. ఈ సినిమా విషయం లో కూడా అదే చేసాడు. పేదవాడి కోసం ప్రాణాలైనా ఇచ్చే నాయకుడిగా తన మాస్ యాక్షన్ తో అదరగొట్టాడు. సినిమా అంత కూడా రజనీ చుట్టూనే తిరుగుతుంది. ప్రేమ , కోపం , యాక్షన్ ఇలా ప్రతి దానిలో రజనీ మార్క్ చూపించాడు. ఈ వయసులో కూడా ఆ రేంజ్ లో నటించడం ఒక్క రజనీ కే చెల్లుతుందని సినిమా చూస్తే ఎవరైనా అంటారు. * నానా ప‌టేక‌ర్‌ యాక్టింగ్ కూడా సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఏ రాజకీయ నాయకుడైన ఖాళీ స్థలం కనిపిస్తే చాలు దానిని దోచుకోవాలని చూస్తుంటాడు. ఈ సినిమాలో నానా ప‌టేక‌ర్‌ అదే చేసాడు. * రజనీ భార్య గా ఈశ్వ‌రీరావు నటన చాల బాగుంది. * ఎన్‌జి.ఒ స‌భ్యురాలుగా హ్యూమా న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. * స‌ముద్ర‌ఖ‌ని పాత్ర ప‌రిధి మేర చ‌క్క‌గా ఉంది. * అంజ‌లి పాటిల్‌, అర‌వింద్ ఆకాశ్‌, షాయాజీ షిండే త‌దిత‌రులు వారి వారి పరిధిలో బాగానే నటించారు. * ఇక పా. రంజిత్ విషయానికి వస్తే..కబాలి తో నిరాశ పరిచినప్పటికీ , ఈ మూవీ తో మాత్రం ఆకట్టుకున్నాడు. రజనీ నుండి ప్రజలు ఏం కురుకుంటున్నారో దానిని చూపించాడు. ఇంత పెద్ద దేశం లో పేదవాడు ఉండడానికి భూమి ఎందుకు లేదు అనే పాయింట్ తీసుకున్నాడు. స్వాతంత్యం వ‌చ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. 60 శాతం మంది ప్ర‌జ‌లు స్వంత ఇల్లు లేకుండా ఉన్నారు. అటువంటి వారి గురించి, వారి స‌మ‌స్య‌లు గురించి తెలుపే సినిమా గా ఈ కాలా ను తెరకెక్కించాడు. కథ కు కరెక్ట్ గా రజనీ ని ఎంచుకొని సక్సెస్ అయ్యాడు. ఆయన ఏమి చెప్పదల్చుకున్నాడో తెర ఫై అర్ధమయ్యే విధంగా చూపించాడు. కాకపోతే స్లో నేరేషన్ వల్ల కాస్త ఇబ్బంది తప్పదు. త్వరలో రాజకీయాల్లో రాబోతున్న రజనికి ఈ మూవీ చాల హెల్ప్ అవుతుంది. చివరిగా : రజనీ నుండి అసలుసిసలైన సినిమా కావాలని ఎదురు చూసే వారికీ కాలా ఫుల్ భోజనం అవుతుంది. పేదవాడు ఎలాంటి కష్ఠాలు పడుతున్నాడో..ఇంత పెద్ద దేశం అయి ఉండి కూడా కనీసం ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి పేదవాడిదని డైరెక్టర్ బాగా చూపించాడు. రజనీ సైతం ఈ కథకు పూర్తి న్యాయం చేసాడు. ఈయన చుట్టే కథ అంత సాగుతుంది. ఓవరాల్ గా కాలా..రజనీ మాస్ పెర్ఫామెన్స్.
Published on Friday, June 08, 2018
2
మహానటి : రివ్యూ
మహానటి : రివ్యూ తనకు ఏ పనైనా రాదు అంటే చేసి చూపించే పట్టుదల ఉన్న సావిత్రి (కీర్తి సురేష్) నాటికలను వేస్తూ సినిమా రంగంవైపు ఎలా వెళ్లింది. ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సహ నటుడు జెమిని గణేషన్ (దుల్కర్ సల్మాన్) తో రిలేషన్ ఎలా ఏర్పడింది. ఆ తర్వాత ఎలాంటి కష్టాల్లో పడ్డది. చివరకు ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయింది.. సావిత్రి కథనే మహానటిగా ఆవిష్కరించారు. ఆమె కథను కవర్ చేస్తూ జర్నలిస్ట్ వాణి (సమంత) కనిపించారు. మహానటి సావిత్రి ఆమె పాత్రలో అభినయించాలంటే గట్స్ కావాలి దాన్ని నూటికి నూరు పాళ్లు న్యాయం చేసింది కీర్తి సురేష్. సావిత్రమ్మగా కీర్తి సురేష్ నటనకు అవార్డ్ రావడం గ్యారెంటీ అన్నట్టుగా నటించింది. ఇక మధురవాణిగా సమంత ఎప్పాటిలానే బాగానే నటించింది. ఆంటోనిగా విజయ్ దేవరకొండ ఓకే. జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అదరగొట్టాడు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు గొప్పగా నటించారు. ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు, నాగ చైతన్య, క్రిష్, అవసరాల శ్రీనివాస్ ఇలా అందరు బాగా చేశారు. మిక్కి జే మేయర్ మ్యూజిక్ బాగుంది. టైటిల్ సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక సినిమాకు కెమెరా వర్క్ బాగుంది. ఫిల్మ్, డిజిటల్ ఫార్మెట్స్ లో సినిమా తెరకెక్కించడం విశేషం. సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలుస్తుంది. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. దర్శకుడు నాగ్ అశ్విన్ సావిత్రి బయోపిక్ గా అన్ని అంశాలను చాలా క్లియర్ గా క్లవర్ గా చూపించారు. సినిమా టెక్నికల్ గా కూడా ఎలాంటి బోర్ లేకుండా ప్రతిభ చాటాడు. ఇక స్వప్న దత్, ప్రియాంకా దత్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. తెలిసిన కథను సినిమాగా చెప్పే క్రమంలో కొన్ని తప్పులు దొర్లుతాయి కాని సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటిలో వేలెత్తి చూపించేందుకు ఎలాంటి తప్పు లేదు. దర్శకుడు చాలా రీసెర్చ్ చేసి మరి తెరకెక్కించారు. ప్రతి అంశాన్ని చాలా కూలంకశంగా చూపించారు. మహానటి జీవితంలోని ప్రతి అంశాన్ని టచ్ చేశారు. ఆమె నటిగా గొప్ప స్థాయికి వేళ్లిన సీన్స్ తో పాటుగా తాగుడికి బానిసగా మారిన సన్నివేశాలను మనసుకి హత్తుకునేలా చేశారు. సావిత్రి బయోపిక్ అనగానే ఇదేదో డాక్యుమెంటరీగా కాకుండా పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ గా ఈ సినిమా వచ్చింది. సినిమాకు అవసరం లేని ఏ విషయాన్ని ఇందులో ప్రస్థావించలేదు. ఆ మహానటి పాత్రలో కీర్తి సురేష్ ఏమాత్రం తీసిపోని విధంగా నటించింది. పాత్రలన్ని పోటాపోటీగా నటించాయి. ఇలాంటి కథను చెప్పే ధైర్యం చేసినందుకు దర్శకుడు మెచ్చుకుని తీరాల్సిందే. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా మహానటిని తెరకెక్కించారు. అది కూడా ప్రేక్షకులు మెచ్చేలా మనసుకి హత్తుకునేలా సినిమా ఉంది. అంతేకాదు సినిమా ముగిసినా ఆ పాత్ర మనల్ని వెంటాడుతూ వచ్చేలా చేశారు దర్శకుడు.
Published on Wednesday, May 09, 2018
3
'నా పేరు సూర్య' : రివ్యూ ★ - 2.5/5
'నా పేరు సూర్య' : రివ్యూ ★ ★ ★ ★ ★ ★- 2.5/5 ఆర్మీ ఆఫీసర్ అయిన సూర్య (అల్లు అర్జున్) కోపం వస్తే చాలు ఏమాత్రం ఆలోచించకుండా గొడవకు దిగుతాడు. ఈ టైంలో ఆర్మీ కస్టడీలో ఉన్న ఓ టెర్రరిస్ట్ ను పర్మిషన్ లేకుండా షూట్ చేస్తాడు. మేజర్ పర్మిషన్ లేని కారణం చేత అతను మారితే కాని మళ్లీ డ్యూటీలో చేరే ఛాన్స్ ఇవ్వరని చెబుతారు. అయితే ఈ క్రమంలో అతనో సైకాలజిస్ట్ దగ్గరకు పంపిస్తారు. ఆ సైకాలజిస్ట్ సైన్ చేస్తేనే మళ్లీ అతన్ని జాయిన్ చేయించుకుంటామని అన్నారు. రామకృష్ణ రాజు (అర్జున్) తన తండ్రే అయినా చిన్న వయసులోనే ఇంటి నుండి దూరంగా వెళ్లిన సూర్య అతన్ని కేవలం ఓ బయటవ్యక్తిగానే చూస్తాడు. ఇక అప్పటివరకు బోర్డర్ వెళ్లి కాపలా ఉండాలనుకున్న సూర్య వైజాగ్ లో చల్ల వల్ల ఇబ్బంది పడుతున్న ఓ సోల్జర్ కుటుంబానికి అండగా నిలబడతాడు. ఇంతకీ చల్లా ఎవరు..? సోల్జర్ గా సూర్యా ఎలాంటి రిస్కులు తీసుకున్నాడు..? అతని తండ్రికి సూర్య దగ్గరయ్యాడా అన్నది సినిమా కథ. సూర్య పాత్రలో అల్లు అర్జున్ అదరగొట్టాడు. సనికుడిగా బన్ని పడిన కష్టం తెర మీద కనబడుతుంది. డ్యాన్స్, ఫైట్స్, యాక్టింగ్ వీటన్నిటిలో బన్ని వన్ మ్యాన్ షో చేశాడు. అను ఎమ్మాన్యుయెల్ కేవలం పాటలకే అన్నట్టు ఉంది. అర్జున్ పాత్ర బాగుంది. సహజ నటనతో ఆకట్టుకున్నాడు. రావు రమేష్, శరత్ కుమార్, సాయి కుమార్ అందరు బాగానే చేశారు. నదియా చిన్న పాత్రకే పరిమితం అయ్యింది. రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు తగినట్టుగా మంచి లొకేషన్స్, దానికి తగిన కెమెరా పనితనం చూపించారు. విశాల్ శేఖర్ మ్యూజిక్ రెండు సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ ఇంకాస్త ట్రిం చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైరక్టర్ వక్కంతం వంశీ కంటెంట్ బాగుంది. అయితే దాన్ని తెరకెక్కించే విధానంలో అంత గ్రిప్పింగ్ గా రాసుకోలేదు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.. రచయితగా వక్కంతం వంశీ గొప్ప కథనే రాసుకున్నాడు. ముఖ్యంగా టెర్రరిస్ట్ గా యువకులు ఎలా మారుతున్నారు అన్న పాయింట్ మీద నడిచిన క్లైమాక్స్ సీన్ బాగుంది. అయితే సినిమా మొదట ఓపెనింగ్ హీరో క్యారక్టరైజేషన్ అంతా బాగున్నా సెకండ్ హాఫ్ వచ్చే సరికి సినిమా ఎందుకో ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక హీరో హీరోయిన్ కేవలం రొమాన్స్, సాంగ్స్ కు అన్నట్టే ఉంది. సాంగ్స్ ఓకే లవర్ ఆల్సో, ఇల్లే ఇండియా దిల్లే ఇండియా సాంగ్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఎక్సైటింగ్ గా సాగుతుంది. అయితే సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు చెప్పదలచుకున్న పాయింట్ మీద అంతగా దృష్టి పెట్టలేకపోయాడు. సూర్య పాత్రలో బన్ని మంచి పర్ఫార్మెన్స్ అందించాడు. గొప్ప కథ చెప్పే ప్రయత్నంలో స్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని మంచి ఎమోషన్, ఫైట్స్ ప్లాన్ చేసినా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కాస్త వీక్ అయినట్టుగా ఉన్నాయి. సినిమాకు కనెక్ట్ అయిన వారికి నచ్చే అవకాశం ఉన్నా రెగ్యులర్ ఆడియెన్స్ కు నచ్చే అవకాశం ఉండదు.
Published on Wednesday, May 09, 2018
4
భరత్ అనే నేను సినిమా రివ్యూ
భరత్ అనే నేను సినిమా రివ్యూ: ప్రిన్స్ కెరీర్‌లో తప్పనిసరిగా హిట్టు కావాల్సిన తరుణంలో ప్రస్తుతం భరత్ అనే నేను సినిమాతో మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందుకోసం విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో లండన్‌లో పెరుగుతాడు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఐదు డిగ్రీలు పొందుతాడు. తండ్రి ఆకస్మిక మరణంతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన భరత్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టాల్సి వస్తుంది. సీఎంగా మారిన భరత్.. వసుమతి అనే ఎంబీఏ విద్యార్థి ప్రేమలో పడుతాడు. సీఎం పదవి చేపట్టిన భరత్ అనూహ్య నిర్ణయాలు తీసుకొని ప్రజల మన్ననల్ని పొందుతాడు. కానీ ఓ కారణంగా సీఎం పదవికి రాజీనామా చేస్తాడు. ఆ తర్వాత తండ్రి మరణం సహజం కాదనే విషయం తెలుస్తుంది. క్లైమాక్స్ ఇలా అద్భుతమైన పాలనను అందిస్తున్న భరత్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? తండ్రి ఎలా చనిపోయాడు. తండ్రి మరణం వెనుక ఉన్న వ్యక్తులపై ఎలాంటి పగను తీర్చుకొన్నాడు? వసుమతి ప్రేమ కోసం భరత్ ఏం చేశాడు? సీఎం పీఠాన్ని భరత్ తిరిగి ఎలా దక్కించుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే భరత్ అనే నేను చిత్ర కథ. తండ్రి మరణంతో లండన్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చే క్రమంలో తన బాల్యానికి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ చకచకా సాగిపోతాయి. అనూహ్య పరిస్థితుల్లో భరత్ సీఎంగా మారడంతో సినిమా మరో మలుపు తిరుగుతుంది. కథలో వేగం పెరగడంతో వినోదంతో చక్కగా సాగిపోతుంది. ఓ ఆసక్తికరమైన సన్నివేశంతో సినిమా ప్రథమార్థం ముగుస్తుంది. సెకండాఫ్‌లో ప్రధానంగా రాష్ట్రంలోని సమస్యలు, వాటి పరిష్కారం అనే అంశాల దిశగా సినిమా ముందుకెళ్తుంది. అయితే రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు బలంగా లేకపోవడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. కానీ మహేష్‌బాబు నటన, కొరటాల మార్కు టేకింగ్ ఆ లోపాల నుంచి ప్రేక్షకులను బయటపడేయడానికి దోహద పడుతాయి. సెకండాఫ్‌లో ఉప ఎన్నికల ఎపిసోడ్‌ను మరింత బలంగా చెప్పే అవకాశం ఉన్నా దానిని దర్శకుడు సద్వినియోగం చేసుకోలేకపోయడానే ఫీలింగ్ కలుగుతుంది. రాజీనామా అనంతరం ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సన్నివేశాలు అతి సాధారణంగా ఉండటం, ఎమోషనల్ కంటెంట్ ఎక్కడా కనిపించకపోడం కొంత మైనస్‌గా కనిపిస్తుంది. కొరటాల శివ విజన్, టేకింగ్ ఎప్పటిలానే కొరటాల శివ సామాజిక అంశాలతో కథను అల్లుకొన్నాడు. మహేష్‌బాబు కెరీర్‌లో భరత్ అనే నేను ఓ ప్రత్యేకమైన చిత్రమని చెప్పవచ్చు. కియారా అద్వానీ గ్లామర్ భరత్ అనే నేను సినిమాకు కియారా అద్వానీ గ్లామర్ అదనపు ఆకర్షణ. ప్రకాశ్ రాజ్ మరోసారి అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. ఇలాంటి పాత్ర ప్రకాశ్ రాజ్‌కు కొట్టిన పిండే. సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం జీవం పోసింది. రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి మరో హైలెట్ అని చెప్పవచ్చు. అసెంబ్లీ సెట్, వచ్చాడయ్యో సాంగ్ కోసం ఆలయం సెట్‌ను కళ్లు చెదిరేలా రూపకల్పన చేశారు. ఎడిటింగ్ విభాగం పనితీరు బాగానే ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో కొన్ని చోట్ల ఎడిటింగ్‌కు స్కోప్ ఉంది. వీఎఫ్ఎక్స్ టీమ్ వర్క్ కూడా ఆకట్టుకొన్నది. కథ డిమాండ్ మేరకు సినిమాను చాలా రిచ్‌గా రూపొందించడంలో నిర్మాత డీవీవీ దానయ్య సఫలమయ్యాడు. భరత్ అనే నేను చిత్రం మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా మారే అవకాశం ఉంది. Rating: 3/5
Published on Tuesday, May 01, 2018
5
రంగస్థలం మూవీ రివ్యూ:
రంగస్థలం మూవీ రివ్యూ: Rating: 3.5/5 80 దశకం నాటి పరిస్థితులు, కథా నేపథ్యంగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రంలో సమంత అక్కినేని, అనసూయ, ఆది పినిశెట్టి, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, నరేష్ లాంటి నటుల పాత్రలు ప్రత్యేకతను సంతరించుకొన్నాయి. రంగస్థలం కోసం వేసిన గ్రామం సెట్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఎన్నో విశేషాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. రంగస్థలం కథ.. చెవిటివాడైన చిట్టిబాబు (రాంచరణ్) రంగస్థలం గ్రామవాసి. పొలానికి నీటి సౌకర్యాన్ని అందించే పంపుసెట్ల ఇంజినీర్. చిట్టిబాబుకు కుమార్ అనే అన్నయ (ఆది పినిశెట్టి), తల్లి, తండ్రి (నరేష్), ఓ చెల్లలు ఉంటుంది. చిట్టిబాబు అన్యాయాన్ని అసలే సహించడు. రామలక్ష్మీ (సమంత)తో ప్రేమలో పడుతాడు. గ్రామంలో ప్రెసిడెంట్ (జగపతిబాబు) చేసే అన్యాయాలను ఎదురించడానికి అన్నదమ్ములు సిద్ధమవుతారు. గ్రామాభివృద్ధి కోసం ప్రసిడెంట్‌గా పోటీ చేయాలని కుమార్ ఎన్నికల బరిలోకి దిగుతాడు. కుమార్‌కు అండగా నవభారత్ పార్టీ ఎమ్మెల్యే (ప్రకాశ్ రాజ్) అండగా నిలుస్తాడు. రంగస్థలం ముగింపుకు ఎన్నికల బరిలోకి దిగిన కుమార్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఎన్నికల బరిలోకి దిగిన తన అన్నయ్యకు చిట్టిబాబు ఏ విధంగా తోడ్పాటునందించాడు? ప్రేమించిన రామలక్ష్మీని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఎన్నికల్లో కుమార్ గెలిచాడా? ప్రసిడెంట్ పరిస్థితి ఏమైంది? రంగస్థలంలో ప్రసిడెంట్ దురాగతాలను ఎలా చరమగీతం పాడారు అనే ప్రశ్నలకు సమాధానమే రంగస్థలం సినిమా కథ. ఫస్టాఫ్ స్క్రిప్టు అనాలిసిస్ గ్రామ రాజకీయాలకు అద్దంపట్టే విధంగా రూపొందిన స్క్రిప్టు రంగస్థలం. ఈ కథలో కుటుంబంలో ఉండే విభేదాలు, భావోద్వేగాలు సజీవంగా నిలుపడంలో దర్శకుడు సుకుమార్ సఫలమయ్యాడు. 1980 నాటి బ్యాక్ డ్రాప్‌తో ప్రారంభమయ్యే రంగస్థలం సినిమా కథలో తొలి భాగంలో క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్‌మెంట్ చక్కగా సాగుతుంది. బలమైన పాత్రలు కథకు ప్రాణంగా నిలిచాయి. తొలిభాగంలో చిట్టిబాబుగా రాంచరణ్, సమంత రామలక్ష్మీ పాత్రలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఓ అనూహ్యమైన మలుపు రెండో భాగంపై ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్ స్క్రిప్టు అనాలిసిస్ రంగస్థలం రెండో భాగంలో గ్రామ రాజకీయాలు, ఎన్నికలు, ప్రేమ, కుటుంబం మధ్య భావోద్వేగభరితమైన అంశాలు కథపై పట్టుసాధిస్తాయి. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశాలు ఒకదానికి ఒకటి పోటీ పడుతూ సినిమాను మరోమెట్టు ఎక్కించాయి. రంగస్థలం సినిమాకు క్లైమాక్స్ ఆయువుపట్టు. కథపై పట్టు సడలకుండా దర్శకుడు కథను నడిపించిన తీరు అమోఘం అని చెప్పవచ్చు. డైరెక్టర్ సుకుమార్ విజన్, టేకింగ్ రంగస్థలం కోసం సుకుమార్ రాసుకొన్న కథను మనకు తెలియకుండా ఎక్కడ నుంచో తీసుకొచ్చింది కాదు. గ్రామాల్లో మన కళ్లముందు కనిపించే సజీవ దృశ్యాలకు తెర రూపం కల్పించడంలో సుకుమార్ పరిణతికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. రాంచరణ్ యాక్టింగ్ ఇప్పటివరకు రాంచరణ్‌ ఓ స్టార్ హీరోగానే కనిపిస్తాడు. రంగస్థలం సినిమా చూసిన తర్వాత ఓ గొప్ప ఫెర్ఫార్మర్, మంచి నటుడు అని ఒప్పుకోకతప్పదు. సమంత ఫెర్ఫార్మెన్స్ సమంతను గ్లామర్ హీరోయిన్‌గానే ప్రేక్షకులకు పరిచయం. రంగస్థలంలో రామలక్ష్మీ పాత్రను చూస్తే సమంత ఎక్కడ కనిపించదు. అనసూయ, పూజా హెగ్డే రంగస్థలం సినిమాకు ముందు అనసూయ ఇమేజ్ వేరు. కానీ రంగస్థలం చిత్రం చూసిన తర్వాత అనసూయ అంటే రంగమ్మత్తనే గుర్తువస్తుంది. జిగేల్ రాణిగా పూజా హెగ్డే మెరిసింది. ప్రకాశ్ రాజ్, జగపతి, ఆది ఇతరుల రంగస్థలం సినిమాలో ఏ ఒక్క పాత్రను కూడా మనసు నుంచి దూరం చేసుకోలేదు. ప్రతి చిన్న పాత్ర కూడా ప్రేక్షకుడిని వెంటాడుతుంటుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ రంగస్థలం చిత్రాన్ని అందమైన కాన్వాస్‌గా మలచడంలో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తెర వెనుక అద్భుతమైన పాత్రను పోషించాడు. రామకృష్ణ ఆర్ట్ వర్క్ రంగస్థలం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ ఆర్ట్ వర్క్. ఆర్ట్ డైరెక్టర్‌ రామకృష్ణ వేసిన సెట్లు, కాలనీ వాతావరణాన్ని తీర్చి దిద్దిన తీరు హ్యాట్సాఫ్. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యూజిక్‌తో చితక్కొట్టడంలో దేవీ శ్రీ ప్రసాద్ సిద్ధహస్తుడు. కొత్త బ్యాక్ డ్రాప్, పుష్కలంగా లవ్ ఎమోషనల్ సీన్లకు బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో దడదడలాడించాడు. సెకండాఫ్‌లో దేవీ శ్రీ ప్రసాద్ రీరికార్డింగ్ ప్రాణంగా నిలిచింది. రంగా రంగా రంగస్థలాన, ఎంత సక్కగున్నావే, ఆగట్టు నుంటావా, జిగేల్ రాణి పాటలు ఆడియోపరంగానే కాకుండా, తెర మీద కూడా అలరించాయి.
Published on Tuesday, May 01, 2018
6
నాగ చైతన్య, సమంత.. జంటగా..!
నాగ చైతన్య, సమంత.. జంటగా..! పెళ్లి తర్వాత... అక్కినేని నాగ చైతన్య, సమంత.. జంటగా నటించనున్న చిత్రం షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వెళ్తూ... చైతూ తన ట్విట్టర్లో సమంతాతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశాడు. 'ఇది ఖచ్చితంగా కొత్త రోజే.. నా శ్రీమతితో షూటింగ్కి వెళుతున్నాను. మీకు మరింత ఆనందాన్ని అందించనున్నాము... శుభోదయం!!!' అని ట్వీట్ చేశారు. హరీష్ పెద్ది, సాహు గరపాటి సంయుక్తంగా షైన్ స్క్రీన్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు చైతూ, సమంత కాంబినేషన్లో ఇది నాలుగవ చిత్రం కావడం విశేషం. చిత్రానికి 'ప్రేయసి' అనే టైటిల్ను దర్శక, నిర్మాతలు పరిశీలిస్తున్నారు. పెళ్లికి ముందు వీరిద్దరూ... ఏం మాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మనం చిత్రాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చైతు నటించిన 'సవ్యసాచి' ఫస్ట్లుక్ విడుదలై... వైరల్గా మారింది. మరోపక్క సమంత నటించిన 'రంగస్థలం' సినిమా విడుదలకు ముస్తాబవుతుంది.
Published on Tuesday, March 20, 2018

 

First Previous 1 2 3 Next Last 
 
Rewards Achiever List  
 
LaxmiBhavani
K.NARESH1
Hyderabad
K.NARESH3
Others
V.GOPI
Others
ANTHONY CHINAPPA MARIAN
HYDERABAD
N.RAJKUMAR
Narella Vijaykumar
ELURU
J. NATARAJ
K.VENU
Hyderabad
G.SATEESH
Hyderabad